ఆటో బోల్తా… ఐదుగురికి తీవ్ర గాయాలు
1 min read
పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం : మండల కేంద్రమైన రుద్రవరం సమీపంలోని ఆర్ అండ్ బి ప్రధాన రహదారిలోని తెలుగు గంగ ఉపకాలవ కల్వర్టు వద్ద ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు రుద్రవరం గ్రామానికి చెందిన ఆటో ఆళ్లగడ్డ నుంచి రుద్రవరం వస్తుండగా గ్రామ సమీపంలోకి చేరుకోగానే గంగ ఉపకాలవ కల్వర్టు వద్ద కుక్క అడ్డు రావడంతో డ్రైవరు ఆటోను తప్పించబోయే క్రమంలో బోల్తా పడిందన్నారు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న తిప్పారెడ్డి పల్లె గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలి కాలు నుజ్జవగా ఆర్ నాగులవరం గ్రామానికి చెందిన శేషయ్య ఆచారి విద్యార్థులు పూజిత 9వ తరగతి లింగమయ్య ఆటో డ్రైవర్ రాజుకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు అక్కడి నుండి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారన్నారు.