PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

21, 31 జీవోలు రద్దు చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలి       

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఆటో కార్మికులకు శాపంగా మారిన 21 31 జీవోలను రద్దు చేయాలని ఏఐటీయూసీ ఇచ్చిన రాష్ట్ర  వ్యాప్త పిలుపు మేరకు బుధవారం పత్తికొండ నాలుగు స్తంభాల కూడలి వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ఇన్చార్జి, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్ క్రిష్ణయ్య  , ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి యం రంగన్న లు‌  మాట్లాడుతూ, ఆటో రంగంలో పనిచేస్తున్న కార్మికులు రోజు రోజు కూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వలన పెరుగుతున్న డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరల వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడలుగా చేసి బడా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్చి కార్మికుల హక్కులపై దాడులు చేస్తుందని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం‌ కార్మికుల‌‌కు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అపరాధ రుసుం రేట్లు (ఫైన్లు) 21,31, జీవోలు అడ్డు పెట్టుకొని ఆటో కార్మికులపై వాహన మిత్ర పథకం ద్వారా 10 వేల‌రూపాయలు ఇస్తున్నామన్న నేపంతో  ఆటో కార్మికులపై ట్రాన్స్పోర్ట్ అధికారులు విపరీతమైన ఫైన్లు వేస్తూ   20 వేల నుండి 30 వేలు అక్రమంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. ఆటో కార్మికులపై భారీ చలానాలను వేయడానికి తెచ్చిన 21,31 జీవోలు తక్షణమే రద్దు  చేయాలని డిమాండ్ చేశారు. చేసి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం పెరుగుతున్న డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలు తగ్గించి జి.యస్.టి పరిధి నుండి తొలగించాలని కోరారు.  అలాగే ఆటో కార్మికునికి బ్యాంకుల్లో సొంత పూచీకత్తుతో వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, ఆటో ఫైనాన్స్ లపై నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, పి .యఫ్.,ఇ.యస్.ఐ. సౌకర్యం కల్పించాలని,ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని,55 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు 7000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, ఆటో కార్మికులకు ఇళ్ళ స్థలాలు, ఇల్లు మంజూరుు చేయాలని డిమాండ్ చేశారు.ఏఐటియుసి తాలూకా అద్యక్షులు జి. నెట్టికంటయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూకా గౌరవ అధ్యక్షులు బి మాదన్న, ఏఐటీయూసీ తాలూకా డిప్యూటీ కార్యదర్శి మాజీ వార్డు మెంబర్ గుండు భాష, ఏఐటీయూసీ తాలూకా ఉపాధ్యక్షులు ఎం రాజప్ప,ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు హోసూరు రమేష్ మాలింగ(ధర్మా ), దూదేకొండ ఆటో యూనియన్ నాయకులు కరెంట్ శేఖర్, ,యమ పెద్ద హుల్తి ఆటో యూనియన్ నాయకులు ఉచ్ఛన్న, రవి, పరశురాముడు,  మలగవల్లి రమేష్, రామోజీ,వీరేష్, చంద్రశేఖర్,మాలిక్, అక్రం భాష ,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

About Author