యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యవర్గ సభ్యుడుగా అవినాష్ శెట్టి బాధ్యతలు స్వీకరణ
1 min read
కర్నూలు స్పోర్ట్స్ న్యూస్ నేడు : యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఏం.అవినాష్ శెట్టి మంగళవారం యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యవర్గ సభ్యుడుగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి మంగళవారం కర్నూల్ లోని తన కార్యాలయంలో అవినాష్ శెట్టి నీ ఘనంగా సత్కరించారు. లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా,రాష్ట్రం అభివృద్ధి కోసం అవినాష్ శెట్టి చేస్తున్న కృషి వెలకట్టలేనిది అన్నారు.యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యవర్గ సభ్యుడుగా దేశవ్యాప్తంగా యోగ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. యోగ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన కమిటీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని అన్నారు . 2029 మార్చ్ వరకు కమిటీ కొనసాగుతుందన్నారు. అనంతరం అవినాష్ శెట్టి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు పాటు భారతదేశ వ్యాప్తంగా యోగ క్రీడా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారన్నారు. ప్రతిభగల యువ యోగ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుగా ఉంటాయని అన్నారు. తనను ప్రోత్సహించిన ఏషియన్ యోగ సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్ అగర్వాల్,నూతన అధ్యక్షుడు అనిరుద్ గుప్తా,పాటు ప్రధాన కార్యదర్శి అభినవ జోషి,ఉపాధ్యక్షులు మనోహర్ కుమార్, అధ్యక్షుడు సింహరాజు, కార్యనిర్వాహక అధ్యక్షులు వర్మలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.అవినాష్ బాధ్యత స్వీకరణ పట్ల జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె.ఈ జగదీష్ కుమార్, శ్రీనివాసులు, కార్యనిర్వక కార్యదర్శి సునీల్ కుమార్,సభ్యులు డాక్టర్ రుద్ర రెడ్డి,ఈశ్వర్ నాయుడు,జిల్లా యోగ సంఘం సభ్యులు సాగర్,సాయి కృష్ణ, ముంతాజ్ బేగం,నాగరాజు లు వర్షం వ్యక్తం చేశారు.