శీతాకాలంలో `చలి` ని ఇలా దూరం పెట్టండి !
1 min readపల్లెవెలుగు వెబ్: శీతాకాలం వచ్చిందటే చాలు జలుబు, దగ్గు లాంటి సమస్యలు అధికం అవుతాయి. వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పెడతాయి. ఆహారంలో పసుపును చేర్చుకోవడం ద్వార ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా శీతాకాలపు చలిని తట్టుకోవడానికి కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ కొంతమంది వేడి పానీయాలను అధికంగా తీసుకుంటారు. ఇవి జీర్ణవ్యవస్థను ఇబ్బందిపెడతాయి. పసుపు ఆహారానికి రుచిని జోడించడమేకాకుండా, జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాదు తరచుగా ఆహారంలో పసును తీసుకోవడం వల్ల మీ చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపు కూడా వస్తుంది.
ReplyForward |