PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 అసత్య ఆరోపణలు మానుకోవాలి

1 min read

– మంచి పై చెడు గెలిచినట్టు చరిత్రలో లేదు

పల్లెవెలుగు వెబ్​:చెన్నూరు సమాజంలో మంచి పేరు సంపాదించుకొని ఇటు వైయస్సార్సీపి  లోను అటు తనుఎంచుకున్న వ్యాపారరంగంలోనూ తనదైన ముద్రవేసుకొని ముందుకు సాగుతున్న గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి పై అలాగే ఆయన వ్యాపార రంగాల పై అసత్యఆరోపణలు చేయడం మానుకోవాలని ఎంపీటీసీ లు నిరంజన్ రెడ్డి, సాదిక్ అలీ లు అన్నారు గురువారం వారు చెన్నూరు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల అఖిలపక్షం నాయకులు గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి పై, అలాగే భావన టౌన్ షిప్ పై చేసిన ఆరోపణవులపై వారు మాట్లాడటం జరిగింది, చింతకొమ్మదిన్నె మూల వంక వద్ద భూముల పై అఖిలపక్షం నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు, గుమ్మ రాజేంద్రప్రసాద్ రెడ్డి , నీతికి నిజాయితీకి పెట్టింది పేరని వారు తెలియజేశారు, ఆ భూములకు సంబంధించి డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి వద్ద 2017 లోనే అంటే తెలుగుదేశం హయాంలోనే కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు, ఇదంతా కూడా చట్టబద్ధంగా తీసుకోవడమే జరిగింది తప్ప, ఇందులో ఎలాంటి ఆరోపణలకు తావు లేదని వారు అన్నారు, ఇదంతా తెలిసి కూడా అఖిలపక్ష నాయకులు గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి పై ఆరోపణలు చేయడం తగదని వారు తెలిపారు, అఖిలపక్షం నాయకులు కోరిన విధంగానే సిట్టింగ్ జడ్జి చే విచారణ కోరగా దానికి నేను సిద్ధం ఉన్నాను అని ఆయన ధైర్యంగా చెప్పడం జరిగిందని వారు తెలియజేశారు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు గుమ్మ రాజేంద్రప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి లోంగేవాడు కాదని , న్యాయం కోసం ఎంతవరకైనా పోరాటం చేసే వ్యక్తిని వారు తెలియజేశారు. కాబట్టి నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని అలాకాకుండా అసత్య ఆరోపణలు చేయడం తగదని వారికి హితబోధ చేశారు. అఖిలపక్షం నాయకులు సమాజానికి కీడుజరిగే వాటిపై పోరాటం చేయాలే తప్ప మంచి మనిషి, నలుగురి సంతోషం కోరుకునే మనిషి, నలుగురికి సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తిపై ఇలాంటి చెత్త ఆరోపణలు చేయడం సబబు కాదని, ఇలాంటి ఆరోపణలు చేసిన వారిని వదిలి పెట్టారని అలాంటి వారిపై గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి  చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు, కాని , చట్టానికి ,న్యాయానికి లో పడే వ్యాపారాలు చేసే వ్యక్తని, ఒకరికి సహాయం చేసే గుణం తప్ప, ఒకరి సొమ్ము ఆశించే వ్యక్తి కాదని అలాంటి వ్యక్తిపై విమర్శలు చేసేటప్పుడు ఆలోచించాలని, అలా కాకుండా ఎలా పడితే అలా, నిరాధారమైన ఆరోపణలు చేస్తే సమాజంలో మీకున్న గౌరవ మర్యాదలు కోల్పోతారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.

About Author