NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ రాయ‌ల‌సీమ‌కు అనుమ‌తి ఇవ్వండి’

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థకానికి అనుమ‌తులు ఇవ్వాల‌ని కేంద్ర మంత్రి గ‌జేంద్రసింగ్ షెకావ‌త్ ను వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి కలిశారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావ‌త్ తో భేటీ అయ్యారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు క‌డుతోంద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులు నిలుపుద‌ల చేయాల‌ని కోరారు. కేఆర్ఎంబీ ని నోటిఫై చేయాల‌ని గజేంద్ర సింగ్ షెకావ‌త్ ను కోరారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎంపీ ర‌ఘురామ పై మ‌రోసారి లోక్ స‌భ స్పీక‌ర్ కు ఫిర్యాదు చేశామ‌ని తెలిపారు. సీఎం, పార్టీ నేత‌ల‌పై ర‌ఘురామ వ్యాఖ్యల‌ను స్పీక‌ర్ కు వివరించామ‌ని తెలిపారు. ర‌ఘురామ పై త‌క్షణ‌మే వేటు వేయాల‌ని కోరిన‌ట్టు తెలిపారు.

About Author