తహశీల్దార్ సేవాకు పురస్కారం…
1 min read
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: చెన్నూరు తహశీల్దార్ పఠాన్ మహమ్మద్ అలీఖాన్ కు, గురువారం ఆయన కార్యాలయంలో మహాకవయిత్రి మొల్ల సేవా పురస్కారాన్ని మొల్ల సాహితి పీఠం అధ్యక్షులు విద్వాన్ డాక్టర్ గానుగ పెంట హనుమంత రావుఅందచేసి ఆయనను ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా మొల్ల సాహితీపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు విద్వాన్ డాక్టర్ గానుగపెంట హనుమంతరావు మాట్లాడుతూ, చెన్నూరు తహశీల్దార్ ఆలీఖాన్ పనితీరు, ప్రజాసేవ ఎంతో ప్రశంసనీయమని తెలియజేశారు, అందుకే మహా కవయిత్రి మొల్ల పేరుతో ఘనంగా సత్కరించి పురస్కారం ప్రదానం చేశానన్నారు. ఆయన ఇంకా ప్రజలకు ఉత్తమ సేవలందించి ఉత్తమ అధికారిగా ప్రజల ప్రశంసలందుకోవాలని ఆశీర్వదించినట్లు ఆయన తెలిపారు.