PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర చిన్న పరిశ్రమలశాఖ డైరెక్టర్ కు సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రాష్ట్ర చిన్న పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా నియమితులు అయిన మండలంలోని ఓబులంపల్లె గ్రామానికి చెందిన చల్లా వెంకటసుబ్బారెడ్డిని చెన్నూరు లోని ఎంపీపీ కార్యాలయంలో గురువారం ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, అలాగే మైనార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు, ఈ సందర్భంగా ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ మాట్లాడుతూ, చల్ల వెంకటసుబ్బారెడ్డి వైఎస్ఆర్సిపి ఆవిర్భావం నుంచి ఎనలేని కృషి చేయడం జరిగిందన్నారు, కష్టపడ్డ వారికి పార్టీలో ఎప్పటికీ స్థానం ఉంటుందని ఆయన సేవలు గుర్తించి ఆయనకు ఈ పదవి ఇవ్వడం జరిగిందన్నారు, ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులందరూ చల్లా వెంకటసుబ్బారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి ఆయనను ఘనంగా సత్కరించారు, ఈ సందర్భంగా ఆయన మండల వైఎస్ఆర్సిపి నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, మైనార్టీ నాయకులు, బిసి నాయకులు పాల్గొన్నారు .

About Author