PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దివ్యాంగుల ఓటు నమోదు.. ఓటు వినియోగంపై అవగాహన..

1 min read

దివ్యాంగులకు ఓటు నమోదుపై ప్రత్యేకమైన యాప్..

ఆర్డిఓ ఎన్ ఎస్ కె. ఖాజావలి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని ఓటును నమోదు చేసుకోవడంతోపాటు ఓటువేయడం అర్హులైన ప్రతి ఓటరు బాధ్యత అని కేంద్ర ఎన్నికల సంఘం దివ్యాంగులకు ప్రత్యేకమైన యాప్ ను రూపొందించిందని ఏలూరు ఆర్డిఓ ఎన్ ఎస్ కె ఖాజావలి తెలిపారు.  మంగళవారం కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో స్వీప్ కార్యక్రమం ద్వారా దివ్యాంగుల ఓటరు నమోదు ఓటుహక్కు వినియోగించుకోవడం పై అవగాహన కార్యక్రమం జిల్లా ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారిణి రాకడ మణి అధ్యక్షతన జరిగింది.  ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఎన్ ఎస్ కె. ఖాజావలి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అర్హతవున్న ప్రతిఒక్కరూ ఓటును వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుందని అన్నారు.  దీనిద్వారా దివ్యాంగులు సులభతరంగా ఓటునమోదు, ఓటు పోలింగ్ రోజున ప్రత్యేకమైన ఏర్పాట్ల సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు.  ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం దివ్యాంగులలో చైతన్యం కలిగించి వారితో కూడా ఓటుహక్కు వినియోగించుకునేలాగా చర్యలు తీసుకుందన్నారు.  పోలింగ్ కేంద్రాలకు రాలేని దివ్యాంగులను గుర్తించి ఇంటివద్ద నుండి ఓటువేసే విధంగా ఏర్పాట్లు చేశారని తెలిపారు.  ఇంకా ఓటు నమోదు చేసుకోకుండా ఉన్నవారు ఉంటే ఫారం-6 ను అలాగే తప్పులను సరిచేసుకోవడానికి పారం-8 ను ఉపయోగించుకునేలాగా ఆన్ లైన్ ద్వారా ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు.  ఈ అవగాహన కార్యక్రమంలో దివ్యాంగులైన వారికి ఈవిఎంల ద్వారా బ్రెయిలీలిపి ఏర్పాటు చేసి ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందిన్నారు.  ఈ అవగాహన సదస్సులు దివ్యాంగులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్షాఅభియాన్  పివో బి. సోమశేఖర్ మాట్లాడుతూ ఈవిఎంల ద్వారా ఓటువేసే విధానంపై వివిప్యాట్ , కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.  అనంతరం ఈవిఎంలపై ఓటు ఎలాగువేయాలో దివ్యాంగులకు తర్ఫీదు ఇచ్చారు.  కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసరు మరియు డిపివో తూతిక శ్రీనివాస విశ్వనాధ్ దివ్యాంగులతోటి ఓటుహక్కుపై ప్రతిజ్ఞ చేయించారు.  కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల పరిరక్షణ బోర్డు మెంబరు  గిరి, దివ్యాంగులు, తదితరులు పాల్గొన్నారు.

About Author