‘సోమయాజుల పల్లె’లో నీటి కుంటలపై అవగాహన..
1 min read
ఓర్వకల్లు ఎంపీడీఓ శ్రీనివాసులు
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు :రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలంధరకు ప్రతి రైతు కూడా తప్పనిసరిగా మీ పొలాల్లో ఫారం పాండ్ (నీటి కుంటలను)ఉపాధి హామీ పథకం ద్వారా చేయించుకోవాలని ఓర్వకల్లు ఎంపీడీఓ ఎం.శ్రీనివాసులు అన్నారు.శుక్రవారం ఉదయం నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని సోమయాజుల పల్లె సమాజంలో జరుగుతున్న ఉపాధి పనులను ఎంపీడీవో మరియు ఏపీఓ గురు మద్దేశ్వరమ్మ పరిశీలించారు.ఈ సందర్భంగా నీటి కుంటలను చేసుకోవడం వల్ల పొలాల్లో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా మట్టి కూడా కోత గురికాకుండా పొలంలో వేసిన మందులు కొట్టుకోవడానికి ఫారం పాండ్ లో ఉన్నటువంటి నీటిని వాడుకోవచ్చని అదేవిధంగా భూగర్భ జలాలు పెరుగుతాయని ఉపాధి కూలీలతో అన్నారు.నీటి కుంటలను తీయించు కోవాలనుకున్న రైతులు ఉపాధి సిబ్బందికి మీ పత్రాలు ఇవ్వాలని అన్నారు.తర్వాత మధ్యాహ్నం ఓర్వకల్లు మండల పరిషత్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎంపీడీవో మరియు ఈవోఆర్డి పీవీ సుబ్బారాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసులు తదితరులు నివాళులు అర్పించారు.