వెట్టిచాకిరీ నిర్మూలనకు నడుం బిగించాలి..
1 min readకార్మిక శాఖ న్యాయ, సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో
వెట్టిచాకిరీ పై అవగాహన ర్యాలీ,అవగాహన సదస్సు
ప్రతి వ్యక్తి సమాజం పట్ల బాధ్యతగా జీవించాలి..
ఎట్టి చాకిరి నిర్మూలనకు నడుం బిగించాలి
చర్యలకు పాల్పడితే శిక్షార్హులు అవుతారు
జిల్లా న్యాయ సేవాధికారత సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి
సి పురుషోత్తం కుమార్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్ మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ పి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. శుక్రవారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నుండి ఫైర్ స్టేషన్ వరకు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ప్ల కార్డ్స్ ప్రదర్శిస్తూ , స్లొగన్స్ వినిపిస్తు స్థానిక ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి, ఫైర్ స్టేషన్ వద్ద మానవహారంగా ఏర్పడి వెట్టి చాకిరి నిర్మూలనకు స్థానికులకు అవగాహన కలిగించే విధంగా నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. తదనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు పరిశ్రమల యాజమాన్యంతోను మరియు సంబంధిత ఉద్యోగుల తోనూ వెట్టి చాకిరి నిర్మూలనకై తీసుకోవలసిన చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించినట్లుగా తెలియజేశారు. ఈ సమావేశము నందు వక్తలు మాట్లాడుతూ 1976లో వెట్టిచాకి నిర్మూలన చట్టం తీసుకురావడం జరిగిందని, నేటికీ సమాజంలో కొన్నిచోట్ల ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా పనిచేసే హక్కు జీవించే హక్కు కలిగి ఉన్నారని, ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినముగా చట్టం శిక్షిస్తుందని తెలియజేశారు. అలాగే ప్రతి వ్యక్తి సమాజం పట్ల బాధ్యతగా జీవించాలని, ఇటువంటి దుశ్చర్యలు పాల్పడుతున్న వ్యక్తులు తమ దృష్టికి వచ్చిన సంబంధిత అధికారులకు గానీ, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారికి కానీ తెలియచేయాలని, తద్వారా సమాజంలో నేటికీ కొనసాగుతున్న ఈ దురాచారానికి స్వస్తి పలకవచ్చని తెలియజేశారు. బాధితులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయ సహాయమందిస్తుందని వారికి పునరావాసం కల్పించే వరకు సహాయపడుతుందని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో డిసిపిఒ సూర్యచక్రవేణి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్, దిశ ఎస్ఐ కాంతిప్రియ, ప్యానల్ అడ్వకేట్ కూనా కృష్ణారావు, ఏఎల్ యస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ, అడ్వకేట్ రత్నరాజ మరియు ఏసీఎల్ జీ.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.