NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆటో కార్మికులకు అవగాహన సదస్సు ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ నగరంలోని మున్సిపల్ గ్రౌండ్లో ఆటో కార్మికుల సమస్యలపై అన్ని యూనియన్ సంఘాలతో అవగాహన సదస్సు నిర్వహించారు. పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ , మేయర్ బి.వై రామయ్యా , RTO రమేష్ ,మున్సిపల్ అడిషనల్ కమిషనర్ రాంలింగేశ్వర్ , వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు..ఈరోజు ఉదయం కంట్రోల్ రూమ్ నందు ఉన్న మున్సిపల్ పాఠశాల మైదానంలో కర్నూల్ ఎమ్మెల్యే శ్రీ.యం.ఎ హాఫీజ్ ఖాన్  ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  మాట్లాడుతూ ఆటో కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి  కృషి చేస్తున్నారని అన్నారు.ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పుట్టిన బిడ్డ దగ్గర నుండి ప్రజా ఆరోగ్యానికి రక్షణకు ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నారని ఎమ్మెల్యే  తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆరోగ్య శ్రీ ద్వారా 3వేలుపైగా ఆరోగ్య సేవలు ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. వాహనా మిత్ర ద్వారా ఆటో కార్మికులకు 10 వేల రూపాయలను అందించి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని తెలియజేశారు.అలాగే నగరంలో గల వివిధ ఆటో సంఘాల నాయకులు,కార్మికులు(డ్రైవర్లు) ఈ కార్యక్రమం లో గడ్డం రామకృష్ణ , షేక్షావలి ,కేదార్నాథ్ ,పర్ల సూర్యుడు,అక్బర్ అలీ ఫరూక్ ,ఇర్ఫాన్ , CITU, AITUC, IFTUC ఆటో యూనియన్ నాయకులు ప్రభాకర్,ఈశ్వర్ ,రాధాకృష్ణ ,వల్లి ,కృష్ణారెడ్డి ,రాము ,రవికుమార్ ,తిరుపాల్ కుమార్ ,రక్షణ ఆటో & మోటర్ వర్కర్స్ యూనియన్ వారు తదితరులు పాల్గొన్నారు.

About Author