PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతు ఉత్పత్తి దారులకు అవగాహన సదస్సు

1 min read

– రైతు ఉత్పత్తిదారుల సంస్ధలతో (ఎఫి పిఓ) రైతుల ఆదాయం రెట్టింపు..

– రైతు ఉత్పత్తి దారులకు అవగాహన సదస్సు లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటే

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : జిల్లాలో రైతుల యొక్క ఆదాయం పెంపొందించే దిశగా విస్త్రృతంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను (ఎఫ్ పిఓ) ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఉధ్యానశాఖ అధికారులను ఆదేశించారు.  గురువారం స్ధానిక యంపిడిఓ కార్యాలయం ఉధ్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తి దారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశం లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఉత్పత్తి మరియు మార్కెటింగ్ లో స్కేల్ ఆఫ్ స్కేల్ ను ఉపయోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించడంలో రైతు ఉత్పత్తిదారుల సంస్ధలు(ఎఫ్ పిఓలు) కీలక మన్నారు.  దీర్ఘకాలికంగా ఆదాయ-ఆధారిత వ్యవసాయానికి ఎఫ్ పిఓలు భరోసానిస్తాయన్నారు. ఇది వ్యవసాయ ఉత్పత్తి ఖర్చును తగ్గించడం ద్వారా రైతులకు ఎక్కువ డబ్బు సంపాధించడానికి ఉపయోగపడుతుందన్నారు.  జిల్లాలో ఉన్న అన్ని ఉధ్యాన పంటలకు అధిక లాబాలు అందించేలా తోడ్పడటానికి ఉధ్యాన శాఖ అధికారులు కృషి చేయాలన్నారు.  ఎఫ్ పిఓ గ్రూపులకు ఏఐఎఫ్ పధకం కింద కలెక్షన్ సెంటర్ మరియు కోల్డ్ రూమ్ కింద 75 శాతం సబ్సిడీతో అమలు చేయడం జరుగుతుందన్నారు.  అలాగే పిఎఫ్ యం ఎఫ్ ఇ పధకం కింద 35 శాతం సబ్సిడీతో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవచ్చునని 10 లక్షలు రూపాయలు ఒక యూనిట్ కు ఇవ్వబడుతుందని వివరించారు.  రైతులకు డైరెక్ట్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కంటే ప్రొసెస్సెడ్ ఫుడ్స్ ద్వారా లాభదాయకమని, వారియొక్క వార్షిక ఆదాయం ఎక్కువగా పెరుగుతుందని వివరించారు.  సమావేశంలో సిడిబి  డిప్యూటీ డైరెక్టర్ ఎస్. కుమార్, ఎపిఎఫ్ పిఎస్ జోనల్ మేనేజరు కెజె మారుతీ, ఉధ్యాన శాఖ డిప్యూటీ డెరెక్టర్ డా. ఎస్. రామ్మోహన్, నాబార్డ్ డిడిఎం నవకాంత్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author