భూ రక్ష భూ సర్వే పై రైతులకు అవగాహన సదస్సు
1 min readపల్లెవెలుగు , వెబ్ చెన్నూరు: జగనన్న భూ ర క్ష భూ రీ సర్వే పై రైతులకు కు అవగాహన కల్పించినట్లు మండల సర్వేయర్ సోమశేఖర్, సర్పంచ్ సొంట్టం నారాయణరెడ్డి తెలిపారు, మండలంలోని రాచి నాయ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం రైతులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, జగనన్న భూ రక్ష భూ రీ సర్వే ను 6 వందల 70ఎకరాల 25 సెంట్లల్లో నిర్వహించడం జరిగిందన్నారు, జగనన్న భూ రక్ష భూ పథకం ద్వారా డ్రోన్ సహాయంతో 23-03- 22 సంవత్సరంలో ఈ రీ సర్వే నిర్వహించడం జరిగిందని వారన్నారు, అయితే దీని ద్వారా( ఆర్తో రెక్టిఫై ఇమేజ్) ఓ ఆర్ ఐ చేయడం ద్వారా, భూ సర్వే కు సంబంధించిన సీటు రావడం జరిగిందని వారు తెలిపారు, దీనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని రైతులకు తెలియజేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించడం జరిగిందని వారు తెలియజేశారు, రైతులకు సంబంధించిన భూములు సరిహద్దులు అదేవిధంగా గట్లు వంటివన్నీ కూడా ఈ సర్వేలో సక్రమంగా తెలియజేయడం జరిగింది అని వారు రైతులకు తెలియజేశారు, అంతేకాకుండా భవిష్యత్తులో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీని వల్ల రైతులకు ఉపయోగాలు ఏమిటి అనే విషయాలను కూడా క్లుప్తంగా వివరించడం జరిగిందన్నారు, గతంలో భూ సర్వే కి సంబంధించి రైతులు ప్రభుత్వ కార్యాలయాల్లో చుట్టూ తిరిగే వారని, ప్రస్తుతం అలాంటి బాధలు లేకుండా ప్రభుత్వమే రైతులకు సంబంధించిన భూములను సర్వే చేసి వారి భూ సరిహద్దులు చూపించడం జరుగుతుందని వారు తెలియజేశారు.. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన అందుకు రైతులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో, విలేజ్ సర్వేలు వెంకటశివారెడ్డి, జయచంద్రారెడ్డి, శ్రీలత, వీఆర్వో సుధీర్, కార్యదర్శి, రైతులు పాల్గొన్నారు.