మామిడి రైతులకు అవగాహన సదస్సు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలి మండల పరిధిలోని పెద్దపుదిల్లా గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు ఉద్యాన శాఖ నంద్యాల జిల్లా వారి సౌజన్యంతో డాక్టర్ వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం బోర్డ్ మెంబర్ సుమిత్ర మరియు సర్పంచ్ బండి ఉషారాణి అధ్యక్షతన మామిడి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహానంది పరిశోధన స్థానం నుండి సుబ్రహ్మణ్యం శాస్త్రవేత్త మరియు ఉద్యాన పరిశోధనా స్థానం అనంతరాజుపేట శ్రీధర్ శాస్త్రవేత్త పాల్గొన్ని వారు మాట్లాడుతూ మామిడి పంట లో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు గురించి వివరించారు, ఉద్యాన పథకాల గురించి మరియు రాయితీల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర రెడ్డి ,గ్రామ పెద్ద రామిరెడ్డి, హనుమంత్ రెడ్డి, ఉద్యాన అధికారి జి కళ్యాణి, మండల వ్యవసాయ అధికారి షేక్షావలి, రైతులు ఆర్ బి కే సిబ్బంది మౌలాలి ,దస్తగిరి, రమేష్ పాల్గొన్నారు.