బాల్య వివాహాల నియంత్రణ పై అవగాహన సదస్సు…
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: బాల్యవివాహరహిత సమాజమే భారతదేశం ధ్యేయమని జె ఎస్ డబ్ల్యు సిమెంట్ లిమిటెడ్, కైలాసత్యర్థి చిల్డ్రన్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా శనివారం నాడు (గడివేముల) మండలంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఎస్ఆర్. జి.రవికుమార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల సమాజంలో ఆడపిల్లలు అనేక ఒత్తిడి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈ దురాచారాన్ని అరికట్టాలని అందుకోసం బాలలు అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా కైలాసత్యర్థి చిల్డ్రన్ ఫౌండేషన్ కౌన్సిలర్ ఉషారాణి బాలికలకు ప్రత్యేకంగా వారు ఎదురుకుంటున్న సమస్యలపై అవగాహన కల్పించారు. చిన్న వయసులో వివాహాలు అవడం వలన తలెత్తే ఆరోగ్య సమస్యలను వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జే యస్ డబ్ల్యు సి ఎస్ ఆర్ హెడ్ జి రవికుమార్ మరియు లక్ష్మీనారాయణ రెడ్డి, భాస్కర్, విజయలక్ష్మి, నవ యూత్ అసోసియేషన్ డైరెక్టర్ నరసింహులు, కోఆర్డినేటర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకట తిమ్మారెడ్డి, కౌన్సిలర్ ఉషారాణి మరియు స్కూలు హెడ్మాస్టర్ విక్టర్ ఇమ్మనియేలు పాల్గొన్నారు.