పంట సస్యరక్షణపై రైతులకు అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: బిందు సేద్యం… వ్యవసాయంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, అప్పుడు పోషకాలతో కూడిన పంటను సాగు చేయెచ్చని స్పష్టం చేశారు షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ కర్నూలు బ్రాంచ్ రీజనల్ మేనేజర్ శేఖర్ బాబు అన్నారు. శుక్రవారం కర్నూలు మండలంలోని గార్గేయపురం, సింహవరం, శివరామపురం తదితర గ్రామాల్లో రైతులకు పంట సస్యరక్షణ, పంట పెరుగుదలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్ఎం శేఖర్ బాబు మాట్లాడుతూ సేంద్రీయం… జీవన వ్యవసాయంకు సంబంధించి నాణ్యమైన ఉత్పతులను అందిస్తున్నామన్నారు. తమ కంపెనీ తయారు చేసిన దక్ష, తేజస్వి, భద్ర, బహుళ, సేంద్రీయ ఎరువులు అయిన విరాట్ ఆర్గానిక్,విరాట్ ప్రోమ్, విరాట్ సీఎంఎస్, జీవన ఎరువులైన జీవనమిత్ర, కీర్తి తదితరవి వాడి మంచి దిగుబడులు సాధించారని తెలియజేశారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా.. పలు అంశాలను రైతులకు సంస్థ ఆర్ఎం శేఖర్ బాబు వెల్లడించారు. కార్యక్రమంలో సేల్స్ ఆఫీసర్ మధు, మార్కెట్ డెవలప్మెంట్ టీం ఆఫీసర్ ఈరన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.