NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్పర్శ కుష్ఠు వ్యాధి పై అవగాహన

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్ల లోని స్థానిక ప్రాథమిక ఆసుపత్రి నందు స్పర్శ కుష్టు వ్యాధి పై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవళి, డిపిఎమ్ఓ చంద్రయ్య శెట్టి లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30నుండి ఫిబ్రవరి 13 వరకు స్పర్శ కుష్టువ్యాధిపక్ష ఉత్సవాలు జరుగుతాయని, మండలంలోని అన్ని గ్రామాలలో కుష్ఠువ్యాధి పై గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే చర్మం పైన స్పర్శ లేని మచ్చలు ఉన్న, చెవుల మీద, ముఖం మీద కనితలు ఉన్న, కాళ్లు చేతులపై స్పర్శ తగ్గిన, కనురెప్పలు, కనుబొమ్మల వెంట్రుకలు రాలిన, పాదాలపై చేతులపై బొబ్బలు రావడం వంటివి కుష్టు వ్యాధి లక్షణాలని తెలుసుకొని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇచ్చే ఎం డి టి ముందులను వాడి కుష్టు వ్యాధి నుండి బయటపడవచ్చు అన్నారు. అనంతరం స్పర్శ కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ వెంకటేశ్వర్లు, ఎం పి హెచ్ ఎస్ పరమేశ్వరప్ప ,వేణుగోపాల్ ,పీహెచ్ఎన్ భారతి, స్టాఫ్ నర్సులు, ఎం ఎల్ హెచ్ పిఎస్ లు పాల్గొన్నారు.

About Author