కౌలు కార్డుల పై రైతులకు అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని వండుట్ల, గని, మంచాలకట్ట గ్రామాలలో గురువారం నాడు వ్యవసాయ మరియు రెవెన్యూ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతు సోదరులకు కౌలు కార్డుల జారీకి కావలసినటువంటి విధి విధానాలు, ఉపయోగాలు తెలియజేయడం జరిగింది. కార్డు వల్ల ఉపయోగాలు కనీస మద్దతు ధరకు అమ్ముకునే దానికి, ఇన్పుట్ సబ్సిడీకి, పంట నష్టం జరిగితే ఉపయోగపడుతుందని, డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి ,డాక్టర్ వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలకు అర్హులు అవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.