PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఖైదీలకు ఉచిత న్యాయసేవలపై అవగాహన

1 min read

– జిల్లా కారాగారామును సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు గారు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శనివారం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు మరియు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కు సంబందించిన చీఫ్, డిప్యూటీ, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సెల్స్ పంచలింగాల గ్రామం నందు గల జిల్లా జైలును సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి ఖైదీల వివరాలను సంబందిత జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు మరియు వారికి అందించే భోజన సదుపాయాలను స్వయంగా పరిశీలించి, పర్యవేక్షణ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఉచిత న్యాయసేవల గురించి వివరించారు. 65 సంవత్సరాలు పైబడిన ఖైదీల వివరాలు సేకరించారు. ఖైదీలతో మాట్లాడటానికి వచ్చే వారికి మాట్లాడే సదుపాయాన్ని పరిశీలించారు. అనంతరం ఖైదీల హాజరు పట్టికను పరిశీలించి, ఖైదీలకు ఏదైనా సమస్య వస్తే జిల్లా న్యాయ సేవధికారసంస్థ ను ఆశ్రయించాలని చెప్పారు. వంటగదులు, జైలు గదులను పరిశీలించి సిబ్బందికి పలు సూచలను ఇచ్చారు. ఉన్నత న్యాయ సేవ అధికార సంస్థ ఏర్పాటుచేసిన చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్స్ ద్వారా అందిస్తున్న మెరుగైన ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూల్ జిల్లా న్యాయ సేవధికారసంస్థ కార్యదర్శి శ్రీనివాస రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు గారు, లీగల్ ఎయిడ్ కౌన్సెల్స్, జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులు శ్రీమతి సునీత, శ్రీమతి మాధవి, జైలు పర్యవేక్షణ అధికారులు, పాల్గొన్నారు.

About Author