PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్టీసి బస్టాండ్ లో వడదెబ్బ కు గురికాకుండా అవగాహన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   RTC బస్టాండ్ కర్నూలు నందు వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆద్వర్యం లో   ప్రయాణికులకు  వడదెబ్బ కు గురికాకుండా తీసుకోవలాసిన జాగ్రత్తల పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా HEEO శ్రీనివాసులు గారు మాట్లాడుతూ ప్రస్తుతం వేసవికాలం మొదలై ఉష్ణోగ్రత పెరిగి నందువలన ప్రజలు వడదెబ్బకు ,డీహైడ్రేసన్ కు (నిర్జలీకరణ) గురి కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. వడదెబ్బ లక్షణాలు :  తలనొప్పి ,తలతిరగడం, నీరసం ,జ్వరం  , నాలుక ఎండిపోవడం మరియు స్పృహ    కోల్పోవడం మొదలైనవి.వడదెబ్బ భారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు  :- ఉస్ణోగ్రత ఎక్కువ ఉన్న సమయంలో ఎండలో తిరగకుండా ఉండాలి  , తప్పని సరి పరిస్థితులలొ ఎండలో వెళ్ళవలసి వస్తే గొడుగు / టోపీ వాడడం , పాదరక్షలు ధరించడం చేయాలి ,పిల్లలు , వృద్ధులు , అనారోగ్యంగా ఉన్నవారు మరియు గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి , రోజుకు కనీసం 5 లీటర్లు నీరు త్రాగడం , కొబ్బరినీరు /మజ్జిగ /పళ్ళ రసాలు /ORS ద్రావణం  త్రాగడం. వడదెబ్బ – ప్రథమ చికిత్స:-వడదెబ్బకు గురియైన వ్యక్తిని త్వరగా నీడగల ప్రదేశానికి మార్చాలి మరియు  గాలి తగిలే టట్లు చూడలి ,దుస్తులు వదులు చేసి , చల్లని నీటిలొ ముంచిన  బట్టతో తరచుగా శరీరం తుడవాలి ,ORS ద్రావణం లేదా చిటికెడు ఉప్పు ,చక్కర కలిపిన నీటిని/ మజ్జిగ  త్రాగించాలి, వీలైనంత త్వరగా వడదెబ్బకు గురియైన వ్యక్తిని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెల్లి వైద్య సహాయం అందించే ఏర్పాటు చేయాలని తెలిపారు.  తదుపరి RTC విచారణ కేంద్రం నందు ORS పాకెట్స్ అందుబాటులో ఉంచడమైనది మరియు వడదెబ్బ లక్షణాలు , తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మైక్ అనౌన్సుమెంట్ ద్వారా ప్రయనుకులకు తరచుగా తెలియచేయడం జరుగుచున్నది.ఈ కార్యక్రమం లో Dy DEMO చంద్రసేకర్ రెడ్డి ,  RTC స్టేషన్ మేనేజర్ కాంచనలత , ANM లీలావతి , ASHA సరోజ  తదితరులు పాల్గొన్నారు.  

About Author