NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిడుతూరులో పొలంబడి-పత్తి పంటలపై అవగాహన

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: జిల్లా ఏరువాక కేంద్రం నంద్యాల,ప్రిన్సిపల్ సైంటిస్ట్, డా.ఎ.రామకృష్ణ రావ్,ఏడిఏ విజయ శేఖర్ మిడుతూరు మండల వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ కలిసి మిడుతూరులో రైతులకు ‘పొలంబడి’కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఏ. రామకృష్ణారావు,ప్రిన్సిపల్ సైంటిస్ట్ రైతులకు పత్తి పంటలో సమగ్ర సశరక్షణ పద్ధతులు పత్తి పంటలో ఆశించే రసం పీల్చే పురుగులు మరియు గులాబీ రంగు పురుగు సమగ్ర నివారణ చర్యలను గురించి రైతులకు అవగాహన కల్పింఛారు.ఆ తరువాత  పత్తి పంటను క్షేత్ర  స్థాయిలో పరిశీలించారు.ప్రస్తుతం రసం పీల్చు పురుగులు(పచ్చ దోమ, తామర పురుగులు)మరియు వేరు కుళ్ళు తెగులు ఆశించి నష్టం కలుగ చేస్తున్నట్లు గమనించారు.రసం పీల్చు పురుగుల నివారణకు గాను ఎకరానికి వేపనూనె 10000ppm: 400 మి. లి./200 లీటర్ల నీటి లో కలిపి పిచికారీ చేసుకోవాలని మరియు ఎకరానికి 10 నుంచి 20 పసుపు నీలి రంగు జిగురు  అట్టలను పొలంలో పెట్టుకోవాలి. అవసరాన్ని బట్టి రసాయన పురుగు మందులయిన ఎకరానికి ఇమిడాక్లోప్రిడ్ 80మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 40గ్రా లేదా దయోమిధాక్జమ్ 40గ్రా/200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని రైతులకు సూచించారు.గులాబీ రంగు పురుగు నివారణకు గాను లింగా కర్షక బట్టలు ఏకరానికి 20 చెప్పున పెట్టుకోవాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్బికే విఏఏ అశోక్ మరియు రైతులు పాల్గొన్నారు.

About Author