కళాజాత ద్వారా స్టేట్ బ్యాంకు సిబ్బంది అవగాహన..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గడివేముల బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో గడివేముల గ్రామం మరియు మంచాలకట్ట గ్రామంలో నందు. ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం ఎంవి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ కళాజాత వారు బ్యాంకు పథకాలపై బ్యాంక్ స్కీమ్స్ పై బ్యాంకులో ఉండేటువంటి లావాదేవీల పై ముఖ్యంగా సామాజిక భద్రత పథకాలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అటల్ ఫింషన్ యోజన నగదు రహిత లావాదేవీలు సైబర్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలి జీరో అకౌంట్ గోల్డ్ లోన్స్ ప్రజలకు అర్థమైనటువంటి రూపకంగా మాటల ద్వారా పాటల ద్వారా మ్యాజిక్ షో ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ ప్రదీప్, గడివేముల బిసి కిరణ్ గారు, వెంకటేష్ మరియు కళాజాత బృందం సభ్యులు మెజీషియన్ తేజ కుమార్ డప్పు ప్లేయర్ శ్రీనివాసులు, పొదుపు మహిళా సంఘాలు రైతు సంఘాలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.