పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి,రోళ్లపాడు,అలగనూరు గ్రామాలలో చదువుతున్న విద్యార్థులకు బాలవివాహాలపై మరియు పౌష్టికాహారంపై విద్యార్థులకు అంగన్వాడీ సూపర్ వైజర్ పి.రేణుకా దేవి ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ రేణుకాదేవి మాట్లాడుతూ భేటీ బచావో-భేటీ పడావో(బాలికలను రక్షించండి- బాలికలను చదివించండి)అనే కార్యక్రమంలో భాగంగా చిన్న వయస్సులో వివాహాలు చేయకూడదని అలా వివాహాలు చేయటం వలన వచ్చేటటువంటి నష్టాల గురించి అదేవిధంగా రోజూ మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం వలన కలిగేటటువంటి ప్రయోజనాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈనెల 20వ తేదీ వరకు నిర్వహించే పౌష్టికాహార వారోత్సవాలు మరియు చిరుధాన్యాలతో కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఏఎన్ఎం సుభాషిని,అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు.