PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన…

1 min read

పల్లెవెలుగు, వెబ్​ రుద్రవరం: రుణాలు ఇచ్చేందుకు అనేక కొత్త యాప్ లు పుట్టుకొస్తున్నాయని ఈ లోను యాప్ లో అనేక దారుణాలకు కారణమవుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని సీఐ చంద్రబాబు నాయుడు విద్యార్థులకు హెచ్చరించారు. మండలంలోని నరసాపురం గ్రామ సమీపంలో గల రవి జూనియర్ , డిగ్రీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు లోన్ యాప్ సైబర్ క్రైమ్ డ్రగ్ అడిక్షన్ వలన కలిగే నష్టాల గురించి గురువారం అవగాహన కల్పించారు. రుణాలు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు లోన్ యాప్ ల ద్వారా కొందరిని వలలో వేసుకుంటున్నారని వారు చెప్పే మాయమాటలను నమ్మి రుణాలు పొందుతున్నారని ఈ యాప్ ల ద్వారా రుణాలు తీసుకున్న వారు వారి వేధింపులకు గురవుతున్నారని దిక్కు తోచని స్థితిలో మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇటువంటి లోన్ యాప్ లకు దూరంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించారు. విద్యార్థులు తమ కుటుంబాలలోని వారికి చుట్టుపక్కల వారికి ఈ నకిలీ లోన్ యాప్ పై అవగాహన కల్పించి వారిని చైతన్య పరిచేలా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.

About Author