తడి పొడి చెత్త పై విద్యార్థులకు అవగాహన : కమిషనర్
1 min read– ఆత్మకూరు పట్టణాన్ని స్వచ్ఛతగా తీర్చిదిద్దాలి
– కమిషనర్ ను సన్మానించిన హెచ్ఎం తాజుద్దీన్
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: పట్టణాన్ని స్వచ్ఛ ఆత్మకూరు గా తీర్చిదిద్దాలని ,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పెద్ద కబేలా వీధిలొని చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, లోని విద్యార్థులకు తడి పొడి చెత్త పై అవగాహన కార్యక్రమం హెచ్ఎం తాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించారు. పట్టణాన్ని స్వచ్ఛతగా తీర్చిదిద్దడానికి అందరూ సహకరించాలని అలాగే ప్రతిరోజు ఇంట్లో వెళ్లే చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేసి ఇంటి వద్దకు విజిల్ వేస్తూ వచ్చే మా మున్సిపల్ సిబ్బందికి అందచేయాలని తెలిపారు. అనంతరం కమిషనర్ శ్రీనివాస్ ను హెచ్ఎం తాజుద్దీన్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.