ఫ్లోరోసిస్ వలన కలిగే సమస్యలపై అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ ఫ్లోరోసిస్ నివారణ ,నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ డాక్టర్. సుధాకర్ చిన్నటేకూరు గ్రామాములో గ్రామస్తులకు ,ఫ్లోరోసిస్ వలన కలిగే సమస్యలపై అవగాహన కల్పించినారు,అనంతరం మాట్లాడుతూ సాధరణంగా ఒక లీటర్ నీటికి ఫ్లోరైడ్ 1.5 పిపిఎం (పార్ట్శ్ పెర్ మిలియన్)కన్నా ఎక్కువ ఉండకూడదని, ఫ్లోరోసిస్ బారిన గురైన వారికి ఫ్లోరైడ్ నీటిని త్రాగడం వలన దంతాలు పసుపు,గోధుమ రంగులోకి మారడము,కిడ్నీ సంబంధిత వ్యాధులు ,ఎమూకలు బోలుగా మారిపోవడము,వంగిపోయి కీళ్ళు నొప్పి రావడము,కండరాల బలహీనత పడడము,పిల్లల పెరుగుదలపై ప్రభావము చూపుతుందన్నారు.బీడీ,చుట్ట,పాన్,పాన్ మసాలా వంటివి ఉపయోగించడం వలన ఫ్లోరోసిస్ సంబంధిత ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు.పిప్పిపళ్ళు కారణంగా సరైన పోషకహారము తీసుకోలేరు దాని వలన పోషక లేమికి గురై అనేక రకాల వ్యాధులకు గురి అవుతారు అని తెలిపారు,క్యాల్షియం,విటమిన్ –సి ఉన్న ఆహారాన్ని పాలు, గుడ్డు, రాగిజావా మరియు ఆకుకూరాలు తీసుకోవాలని , క్యాల్షియం,విటమిన్ –సి ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమములో సామజిక ఆరోగ్య అధికారి బిందు , వెంకటేశ్వరమ్మా ఆశా కార్యకర్త, మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.