ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: ఈవీఎంల వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని మండలంలోని బొల్లవరం గ్రామంలో గురువారం నిర్వహించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో భాగంగానే మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈవీఎంల ద్వారా ఎలా ఓటు వేయాలి అనే అంశంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు మండల ఏ ఎస్ ఓ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈవీఎంల ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనేందుకు గాను ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలను వినియోగించింది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేవారు. వీటిని ఎన్నికల అనంతరం భద్రపరచడంతో పాటు వాటిని లెక్కించాలంటే రోజుల తరబడి సమయం పడుతుండడంతో అధునాతన ఓటింగ్ యంత్రాలను వినియోగిస్తున్నట్లు ఏఎస్ఓ మురళీధర్ రెడ్డి తెలిపారు. ఈ విధానం ద్వారా కొన్ని గంటల్లో ఓట్లను లెక్కించి గెలుపు ఓటములు ప్రకటించే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు ప్రభుత్వానికి ఖర్చు సమయం ఆదా అవుతుంది అన్నారు. ఈ విధానంలో కొన్ని అపోహలు ఉన్నా అవి నిజం కాదని ఓటరు తాము ఎంచుకున్న అభ్యర్థికి ఎవరికి ఓటు వేయదల్చుకొని ఓటు వేస్తే వెంటనే తాము ఎవరికి ఓటు వేసాము వేసిన ఓటు ఎవరికి పడింది అనేది ఓటింగ్ యంత్రాల్లో ఓటరుకు వెంటనే కనిపిస్తుంది అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతిరోజు ఒక గ్రామంలో ఓటర్లకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లపై అవగాహన కార్యక్రమం చేపట్టనున్నట్టు ఏఎస్ఓ తెలిపారు ఈ కార్యక్రమంలో వీఆర్ఓ చలమయ్య పంచాయతీ కార్యాలయ సిబ్బంది రాజు, హితేంద్ర తదితరులు పాల్గొన్నారు.