గర్భిణీలకు… బాలింతలకు.. పౌష్టికాహారం పై అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : గర్భవతులు, బాలింతలు పౌష్టికాహార లోపం లేకుండా, ఎప్పుడు ఏ ఏ పద్ధతులలో ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి వంటి వాటిపై శుక్రవారం చెన్నూరు నాగలకట్ట వీధిలోని అంగన్వాడి కేంద్రంలో గర్భవతులకు, సీకే దీన్నే ప్రాజెక్టు అధికారి రమాదేవి అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భవతులకు, బాలింతలకు రాష్ట్రీయ ఫోషణ మా మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం చెన్నూరు మండల పరిధిలో జరుపుకోవడం జరిగిందని ఆమె తెలిపారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తల్లులకి పౌష్టికాహారం గురించి ఎటువంటి ఆహారము ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, వ్యాధి నిరోధక శక్తినిఎలాపెంపొందించుకోవాలి , రక్తహీనతను ఎలా తగ్గించుకోవాలి, వంటి విషయాలను ఆమె తెలియజేశారు, అలాగే పిల్లల యొక్క బరువును ఎత్తును ఎలా పెంచుకోవాలి అన్న విషయాలను ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరిగింది. గర్భవతులు, బాలింతలు ఎక్కువ ఆకుకూరలను ,కూరగాయలను సీజనల్ గ దొరికే పండ్లను తీసుకోవాలని అదేవిధంగా అంగనవాడీ కేంద్రం లో ఇచ్చే వై. యస్. ఆర్ కిట్స్, గ్రుడ్లు, పాలు,ఐరన్ మాత్రలు ప్రతి రోజు , క్రమం తప్పకుండా తీసుకోవాలని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలందరూ హాజరు కావడం జరిగింది. ఈకార్యక్రమం అంగన్వాడి సూపర్వైజర్లు, అంగన్వాడి కార్యకర్తలు గర్బవతులు- బాలింతలు, పాల్గొన్నారు.