కత్తెరపురుగు లార్వాపై అవగాహన అవసరం..
1 min readపల్లెవెలుగువెబ్: చెన్నూరు జొన్న పంట లో వచ్చు కత్తెర పురుగు లార్వా పురుగు ఉధృతిని గమనించి రైతులు దానికి తగినటువంటి యాజమాన్య పద్ధతులు తప్పక పాటించాలని ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఏ ఆర్ ఎస్ కె అనిల్ కుమార్ అన్నారు, బుధవారం ఆయన చెన్నూరు పంచాయతీలోని బుడ్డాయి పల్లె గ్రామ పొలాలలో విత్తిన జొన్న పంట పొలాలను పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, ముఖ్యంగా జొన్న లో వచ్చు కత్తెర పురుగు లార్వా పురుగు ఉధృతిని రైతులు గమనించాలని తెలిపారు, ఈ పురుగు కాండంలో చేరి కాండాన్ని తొలిచి వేస్తాయని తెలిపారు, దీనికి రైతులు తమ యాజమాన్య పద్ధతులను ప పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, ఈ కత్తెర పురుగు లార్వా పురుగు కు సంబంధించి నాలుగవ, అలాగే 5వ దశలో ఇన్ స్టార్ కు బ్రెజిడ్2.5 మిల్లీలీటర్లు పిచికారి చేసుకోవాల్సిందిగా ఆయన రైతులకు సూచించారు, అదేవిధంగా కత్తెర పురుగు మొదటి దశలో ఉంటే, దానికి సంబంధించి ప్రొక్లెయిమ్ మందులు పిచికారీ చేయాలని రైతులకు ఆయన చెప్పడం జరిగినది, ఈ కార్యక్రమంలో ఏ డి ఏ నరసింహారెడ్డి, ఏవో రమేష్ రెడ్డి పలువురు రైతులు పాల్గొనడం జరిగినది.