ప్రపంచ అటిజం అవేర్నెస్ డే పై అవగాహన
1 min read
డాక్టర్ రఘు ….
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం కోడుమూరు కో-లోకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సచివాలయం 2 లో జరుగుచున్న సంచార చికిత్స కార్యక్రమాన్ని జిల్లా నోడల్ అధికారి డాక్టర్. రఘుగారు పరిశీలించి నారు . అనంతరం మాట్లాడుతూ అటిజంను ఆరంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు, తల్లితండ్రులు చిన్నారులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని మంద బుద్ధి ఉన్న పిల్లలు సక్రమంగా మాట్లాడకపోవడము, కారణం లేకుండా ఏడవడము, పేరు పెట్టి పిలిచినా పలకకపోవడము, వంటరిగా ఉండాలని కోరుకోవడము, అందరికన్నా భిన్నంగా, ఆటపాటలు లేకుండా ఎవ్వరితో కలవకుండా ఉండడము, తల్లిని దూరంగా ఉంచడము, ఎదుటివారు నవ్వినా నవ్వకపోవడము, చేసిన పనులు మళ్ళీ చేయడము, శబ్దాలు చేసినా దృష్టి మరల్చకపోవడము, వయస్సుకు తగ్గట్టు మానసిక పరిపక్వత లేకపోవడము, అందరిలో కలవకపోవడము, చెప్పినవి అర్థం చేసుకోకపోవడం, సైగలు చేసిన చూడక పోవడము, చెప్పినవి అర్థం చేసుకుపోవడము వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని జిల్లా సత్వర చికిత్స కేంద్రం ఓ పి నంబర్ 43 వ కేంద్రానికి వెళ్లాలని సూచించిన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్. శ్రీమంత్ మాదన్న , డాక్టర్. నర్మదా , ఆరోగ్య విస్తరణ అధికారి నరసప్ప , సూపర్వైజర్ ఉమాబాయి , కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సుమలత , ఆశా కార్యకర్తలు మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.