శక్తి యాప్ పై నర్సింగ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
1 min read
మహిళల భద్రతకు మెరుగైన పరికరం శక్తి యాప్
మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు నేతృత్వంలో గురువారం ఏలూరు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో “శక్తి యాప్” పై అవగాహన కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థినులకు శక్తి యాప్ వినియోగం, దాని ప్రాముఖ్యత, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించుకోవాలనే అంశాలపై విశదంగా అవగాహన కల్పించారు.మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్, అత్యవసర సందర్భాల్లో కేవలం ఒక్క క్లిక్‌తో పోలీసులకు సమాచారం చేరేలా రూపొందించబడిందని అధికారులు వివరించారు.ఈ సందర్బంగా ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు మాట్లాడుతూ మహిళలు తమ భద్రతకు సంబంధించిన సమస్యలను భయపడకుండా, సంకోచం లేకుండా పోలీసులకు తెలియజేయాలని కోరారు,శక్తి యాప్ ద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా తక్షణ సహాయం పొందవచ్చని,ఏదైనా అసౌకర్యం లేదా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థినులు,మహిళా పోలీస్ అధికారులు తదితరులు పాల్గొని, శక్తి యాప్ వినియోగంపై ప్రాముఖ్యతను తెలియచేశారు.
