ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర గ్రంథాలయ సంస్థ ,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, కిమ్స్ వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో కేంద్ర గ్రంథాలయ సమావేశ భవనంలో ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం మరియు ఉచిత మధుమేహం, బిపి టెస్టుల వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థల రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్, మాజీ గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులు కేజీ గంగాధర్ రెడ్డి, లయన్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కిమ్స్ వైద్యశాల డయాబెటాలజిస్ట్ డాక్టర్ గోపీనాథ్, గ్రంథాలయ కార్యదర్శి పెద్దక్క, గోవిందరెడ్డి, భాషా, కిమ్స్ మార్కెటింగ్ మోతీ భాష ,కిమ్స్ వైద్యశాల డీజీఎం కే ఆనంద్ తదితరుల సమక్షంలో మధుమేహ వ్యాధి పై అవగాహన గోడ పత్రికలను విడుదల చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సి గోవర్ధనగిరి, లయన్ పవన్, లయన్ మోహన్, లయన్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్, మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు కేజీ గంగాధర్ రెడ్డిలు ప్రారంభించారు.