పర్యావరణ సమస్యలపై అవగాహన కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆర్డర్ మరియు ఒరిజినల్ అప్లికేషన్ నెం.360/2018 (SLP (సివిల్) నం.2959/2014) లోఆదేశాలను గురించి మరియు కాలుష్య నియంత్రణ మండలి సమన్వయంతో పర్యావరణ సమస్యలపై (ఈ-వ్యర్థాలు, ఘన వ్యర్థాలు, నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలు, క్షారాల కర్మాగారం మొదలైనవి) అవగాహన కార్యక్రమాన్ని న్యాయ సేవా సదన్ నందు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు మాట్లాడుతూ తడి పొడి చెత్తలను వేరుచేసి డికొంపోస్ట్ చేయడం వలన పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చు, ఇతర వ్యర్థాలను నుంచి కాలుష్యం ఎలా అవుతుంది. ఎలక్ట్రోనిక్ కి సంబంధించినవి మాత్రము అనంతపురము లేదా హైదరాబాదుకు పంపించాలన్నారు అక్కడ మాత్రమే వీటిని డికొంపోస్టు చేస్తారని చెప్పారు. లోకాయుక్త విధులను గురించి కూడా తెలియజేశారు. జిల్లా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, డా కె. విశ్వేశ్వర రెడ్డి, పర్యావరణ ఇంజనీరు బి.వై. మునిస్వామి దుమ్ము, ఘన పదార్థాల వలన వచ్చే వ్యర్థాల వాటి వల్ల వచ్చే నష్టాలను గురించి తేలేయజేశారు. వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమాలను వినియోగించుకోవాలని కపత్రాలను పంపిణిచేశారు. వినాయక ప్రతిమలను సి.క్యాంప్ నందు పంపిణిచేస్తామని తెలియజేశారు. ఈ మట్టి ప్రతిమలను ఉపయోగించటం వల్ల నీటి కాలుష్యాన్ని అరికట్టవచ్చు అని అన్నారు. కర్నూలు ప్రజా వినియోగ సేవల కోసం శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులు శ్రీ వెంకట హరినాథ్ మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం (ఏ ఇతర కోర్టులో పెండింగ్ లేని) కలిగి వున్న వారందరికి ఎలాంటి కోర్ట్ ఖర్చులు లేకుండా సత్వర న్యాయం అందించే ఉద్దేశ్యం తో ఏర్పాటు చేయబడిన వ్యవస్థ పర్మనెంట్ లోక్ అదాలత్ . ఇది రాష్ట్ర హై కోర్ట్ అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక చట్టం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడింది. ఈ తీర్పుకు ఎలాంటి అప్పీలు లేదు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజా ప్రయోజిత సేవ రంగాలకు సంబంధించిన సేవలలో లోపాల వలన కలుగు నష్టాలను విన్నవించి సంబంధించిన న్యాయం త్వరగా పొందవచ్చును. సేవ రంగాలకు సంబంధించి ఎలాంటి సేవలలో లోపంగానీ, నష్టంగానీ, అన్యాయంగానీ జరిగితే తక్షణమే పర్మనెంట్ లోక్ అదాలత్, కర్నూలు వారికీ వినతిపత్రంతో పాటు, తగిన ఆధారాలతో సమర్పించాలి. ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా అతి తక్కువ సమయంలో న్యాయం అందజేస్తారు. పూర్తి వివరాలకు కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న పర్మనెంట్ లోక్ అదాలత్ కార్యాలయం (న్యాయ సేవ సదన్ యొక్క ఫస్ట్ ఫ్లోర్) వారిని సంప్రదించాలి అని వివరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ శాఖ, సానిటరీ ఇన్స్పెక్టర్లు, పంచాయితి సెక్రటరిలు తదితరులు పాల్గొన్నారు.