ఫ్రైడే -డ్రై డే పై అవగాహన కార్యక్రమం
1 min read
పల్లెవెలుగు , కర్నూలు: కర్నూలు పట్టణం యూపిహెచ్సి – జొహరాపురం 1 పరిధిలోని 41 వ సచివాలయం లక్ష్మి గార్డెన్స్ ప్రాంతం లో డెమో శ్రీనివాసులు శెట్టి ఆద్వర్యం లో ఫ్రైడే -డ్రై డే పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది . ఈ సందర్బముగా వారు మాట్లడుతూ ప్రతి శుక్రువారం ఫ్రైడే – డ్రై డే కార్యక్రము లో బాగంగా ప్రజలు నీటి నిల్వలు లేకుండ పూర్తిగా తొలగించి దోమలు పెరుగుదలను అరికట్టాలని మరియు పరిసరాలను పరి శుబ్రంగా ఉంచుకొనవలెనని తెలియచేసారు. తద్వారా దోమల వలన వ్యాప్తి చెందు వ్యాదులు మలేరియా , డెంగ్యూ, చికున్ గున్యా , బోదకాలు , మెదడు వాపు లను ఆరికట్ట వచ్చునని తెలిపారు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి ఏడిస్ ఈజిప్టై అనే దోమవలన వచ్చునని , ఇది పగటిపూట కుట్టు నని , ఈ దోమ పాత రోళ్ళు , కూలర్లు , ప్రిజ్ లు , పూలకుండీలు , పాత టైర్లు , కొబ్బరి చిప్పలు మొదలైన వాటిలో నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెట్టునని తెలిపారు. కావున వారానికి ఒక సారి నీటి నిల్వలను పూర్తి తొలగించిన తరువాత నీటిని నింపుకోవడం వలన దోమల వ్యాప్తిని అరికట్ట వచ్చునని తెలిపారు. జ్వర లక్షణాలు ఉన్న వారు వెంటనే సమీప పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్సలు చేయించు కోవాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో డిప్యూటీ డెమో చంద్రశేఖర్ రెడ్డి , ఆరోగ్య కార్యకర్త అరుణ, అడ్మిన్ సెక్రెటరీ అనూరాధ , ఆశా కార్యకర్త ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.