గుడ్ టచ్-బ్యాడ్ టచ్, అభయ హస్తం టోల్ ఫ్రీ నెంబర్ పై అవగాహన కార్యక్రమం
1 min read
సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వేధింపులపై విద్యార్థులకు సదస్సు
పాల్గొన్న త్రీ టౌన్ సీఐ వి కోటేశ్వరరావు
పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: ఈ రోజుల్లో సైబర్ నేరాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించేందుకు గాను ఏలూరులోని వట్లూరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఏలూరు త్రీ టౌన్ సి.ఐ వి.కోటేశ్వరరావు మరియు వారి బృందం సమక్షంలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ నేరాలు, సమాజంలో స్త్రీలు,బాలికలు ఎదుర్కొంటున్న వివిధ వేధింపులు, అత్యవసర సమయాల్లో చేయవలసిన విధుల గురించి, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ మరియు అభయహస్తం టోల్ ఫ్రీ నంబర్స్ గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఏలూరు జిల్లా ఎస్.పి కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడిన అవగాహన వీడియోను ప్రదర్శించడం జరిగింది.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
