హ్యూమన్ ట్రాఫికింగ్ పై అవగాహన కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాక్సిస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ ,నవయూత్ అసోసియేషన్, చైల్డ్ హెల్ప్ లైన్ -1098 , రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు కలిసి సంయుక్తంగా రైల్వే స్టేషన్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ పి ఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎవరికి ఎటువంటి అనుమానాలు కలిగిన ఆర్పిఎఫ్ పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. స్టేషన్ మేనేజర్ నాగేంద్ర గారు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా చేసేవారు రైళ్ల ద్వారా ఎక్కువగా వెళుతుంటారని అందువల్ల ఆర్పీఎఫ్ వారు ప్రత్యేకంగా హ్యూమన్ ట్రాఫికింగ్ పై దృష్టి సారించారని చెప్పారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా ట్రైన్లను తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాక్సిస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకట తిమ్మారెడ్డి చైల్డ్ హెల్ప్ లైన్-1098 ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుంకన్న రైల్వే ఎలక్ట్రికల్ ఎస్సీ రమణ కమర్షియల్ ఆఫీసర్ మున్నా పాల్గొన్నారు.
రైల్వే ప్రొటెక్షన్, పోలీసు, సమాచారం,