నాటు సారా పై అవగాహన కార్యక్రమం
1 min read
పల్లెవెలుగు , కర్నూలు: కర్నూలు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోగల బంగారు పేట గ్రామంలో నాటు సారా పై ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది . నవోదయం 2.0 లో భాగంగా ఒక ర్యాలీని నిర్వహించి నాటుసారా తయారు చేయడం వల్ల వచ్చు అనర్థాల గురించి వివరించి నాటు సారును పూర్తిగా నిర్మూలించాలని మానివేయాలని తెలపడం జరిగినది తదుపరి బంగారు పేట వాసు వాసులతో ర్యాలీ నిర్వహించడం జరిగినది అనంతరము అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ ఎక్సైజ్ కర్నూలు వారు మాట్లాడుతూ నిన్నటి దినము అనగా 19వ తేదీ ప్రభుత్వం వారు నిర్వహించ తలపెట్టిన నవోదయం కార్యక్రమం 2.0 దిగ్విజయంగా పూర్తి చేయాలని నాటు సారాను పూర్తిగా మానివేయాలని అందులకు ఉపాధి కార్యక్రమంలో పాలుపంచుకొనుటకు గవర్నమెంట్ కూడా కృషి చేయుచుందని తెలుపుతూ పూర్తిగా నాటు సారా నిర్మూలననే కార్యక్రమముగా వాటి యొక్క ధ్యేయంగా ఉంటుందని తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని తెలియజేయడమైనది . ఈ కార్యక్రమంలో ఆర్ హనుమంతరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కర్నూలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్ సిఐలు జయరాం నాయుడు,సుబాసిని ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ మరియు ఎస్సై రెహనా బేగం మరియు సిబ్బంది పాల్గొన్నారు.