వ్యక్తిత్వ వికాసం, కెరిర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం..
1 min readజిల్లా కోఆర్డినేటర్ ఎండి హెచ్ మేహారాజ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యువజన సర్వీసుల శాఖ, సెట్ వెల్, ఏలూరు జిల్లా కలక్టరు వారి ఆదేశములను అనుసరించి, యువజన సర్వీసుల శాఖ, సెట్ వెల్ మరియు జిల్లా ఉపాధి కర్యాలయ సంయుక్త ఆధ్వర్యములో ది.23.12.2023 సెట్ వెల్ కార్యాలయము నందు “వ్యక్తిత్వ వికాసం మరియు కెరీర్ గైడెన్సు పై అవగాహన తరగతి నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా నేషనల్ కెరీర్ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ యం.డి.హెచ్ మేహరాజ్, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సందేశము ఇచ్చారు. యువత వ్యక్తిత్వ వికాసం అభివృద్ది చేసుకోవాలని ఆయన కోరారు. జి. ప్రవీణ్ కృష్ణ మాట్లాడుతూ విద్యార్దులు జీవితంలో లక్ష్యం కృషితో చదివి జ్ఞానం సంపాదించాలని జ్ఞానంతో లక్ష్యాలను సాధించాలని విద్యార్దులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్ధులకు వ్యక్తిత్వ వికాసం అవగాహనా కల్పించారు.ఈ కార్యక్రమమునకు, పి.వి.యన్ సత్యనారాయణ, మేనేజర్ సేట్ వెల్, కె.జె.కెనడి , పర్యవేక్షకులు సేట్ వెల్, వి. వరలక్ష్మి ఎక్సిక్యుటివ్ అధికారి వొకేషనల్ గైడెన్స్, ఏలూరు జిల్లా మరియు విద్యార్థిని విద్యార్దులు పాల్గొన్నారు.