పీజీ హాస్టళ్ల భద్రత, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద పీజీ హాస్టల్ ఆన్‌లైన్ ఎకామడేషన్ సైట్ అయిన పేయింగ్ గెస్ట్ ఆన్‌లైన్ (పీజీవో) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని 500కు పైగా హాస్టళ్లలో భద్రత, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వందమందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. హాస్టళ్లలో ఉండటానికి సరైన మరియు సురక్షితమైన మార్గం గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో పీజీవో సీఈఓ హరికృష్ణ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా పరిశుభ్రత ప్రాధాన్యంపై మహిళలకు అవగాహన కల్పించడానికి వివిధ ప్రదర్శనలు, ఉపన్యాసాలను ఇచ్చారు. ఈ సందర్భంగా హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ, “పీజీ హాస్టళ్లలో జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే పీజీవోలో మా ప్రధాన ఎజెండాలలో ఒకటి. పరిశుభ్రత పరిజ్ఞానం, ప్రవర్తన ద్వారా సంస్కృతిని ప్రభావితం చేయడానికి, హాస్టళ్లలో భద్రత, నాణ్యత అనే ఉమ్మడి లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని స్థాయిల ప్రజలు కలిసి పనిచేయాలి” అని సూచించారు.గౌలిదొడ్డి ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో “పీజీవో సర్వీస్ కాంబో” అనే హోస్ట్ లాయల్టీ ప్రోగ్రామ్ ను హరికృష్ణ ప్రారంభించారు. సౌకర్యాలు కల్పించి, పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచడం విషయంలో వారి నిబద్ధత ఆధారంగా హోస్ట్ లకు ప్రయోజనాలను బహుమతిగా ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందులో భాగంగా హాస్టళ్లకు వాటివాటి స్థోమతను బట్టి ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, లీగల్ పనుల సేవలను అందుబాటులో ఉంచుతారు. సర్వీస్ కాంబో లాయల్టీ ప్రోగ్రామ్ ఆతిథ్య పరిశ్రమలో మొట్టమొదటిది. ఇది పీజీవోలో నమోదు చేసుకున్న హోస్ట్ లకు ప్రయోజనాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంమీద, భద్రత, పరిశుభ్రత అవగాహనపై దృష్టి సారించిన ఈ ప్రచారం, తమ కస్టమర్లతో ఎంగేజ్ అయ్యేటప్పుడు ఇలాంటి ముఖ్యమైన సమస్యల విషయంలో హోస్ట్‌లు తమ నిబద్ధతను ప్రదర్శించేలా చేయడానికి పీజీవోకు ఒక మంచి చొరవ అవుతుంది.