జిల్లా ఎస్పీ ఆదేశాలతో అభయ రక్షక దళం అవగాహన కార్యక్రమం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/8-8.jpg?fit=550%2C414&ssl=1)
ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ స్పెండర్ సుబ్బారావు, మహిళా ఎస్సై కాంతిప్రియ సిబ్బందితో దృశ్య రూపం
మహిళా రక్షణ కోసం అభయ రక్షక దళం విస్తృత ప్రచారం
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి:మహిళలు మరియు బాలికల రక్షణను దృష్టిలో ఉంచుకొని, అభయారక్షక దళ సభ్యులు గస్తీ నిర్వహిస్తున్నారు. వారు సైబర్ నేరాలు, మహిళలపై ఆకతాయిల వేధింపులు, ఇతర భద్రతా సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో, అభయ వాహనం ద్వారా ప్రజలకు దృశ్యరూపంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో సైబర్ నేరాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, మహిళల భద్రతకు అవసరమైన సూచనలు మరియు ఆత్మరక్షణ పద్ధతులపై మార్గదర్శనం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు, బాలికలు తమ భద్రతకు సంబంధించిన సమాచారం పొందుతూ, అజాగ్రత్తగా ఉండకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం కలుగుతోంది. ఈ కార్యక్రమాలు సమాజంలో మహిళలపై జరిగే నేరాలను తగ్గించేందుకు, ప్రజల్లో భద్రతాపరమైన చైతన్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతున్నాయి. టోల్ ఫ్రీ నెంబర్ 112 సైబర్ నేరాల నిర్మూలన కొరకు 1930 బాల్య వివాహాల నిర్మూలన కొరకు 1098 ఆసాంఘిక కార్యకలాపాల నిర్మూలన కొరకు ఏలూరు జిల్లాలో వాట్సాప్ నెంబర్ 9550351100 ల యొక్క సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ప్రజలకు అవగాహన కలిగించిన అభయ రక్షక దళ సభ్యులు నగరంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.