రెవిన్యూ,పంచాయతీ, రిజిస్ట్రేషన్ .. మున్సిపల్ అధికారులతో అవేర్నెస్ ప్రోగ్రాం
1 min read
పల్లెవెలుగు , కర్నూలు: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి.లీలా వెంకట శేషాద్రి ఈ రోజు అనగా 22-02-2025 న న్యాయ సేవా సదన్, కర్నూలు నందు జనన మరణ ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ మరియు వివాహ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసే అంశాల పై రెవిన్యూ,పంచాయతీ, రిజిస్ట్రేషన్ మరియు మున్సిపల్ అధికారులతో అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటుచేశారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి మాట్లడుతు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 మరియు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1945 ప్రకారం వివాహ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారని తెలిపారు. కర్నూలు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ సందీప్ కుమార్ మాట్టాడుతూ కుల ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తు చేసుకొన్నా 15 రోజుల లోపల మంజూరు చేస్తామని తెలిపారు. కోడుమూరు తహసీల్దార్ వెంకటేష్ నాయక్ మాట్టాడుతూ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పల్లెలలో అయితే నెల ఆదాయం Rs. 10,000/- ఉంటే పట్టణoలో అయితే Rs. 12,000/- ఉంటే జారీ చేస్తామని తెలిపారు. మున్సిపల్ అదనపు కమీషనర్ ఆర్. జి. వి. కృష్ణా మాట్టాడుతూ మరణ, జనన ధ్రువీకరణ పత్రాలు నమోదు చేసుకొన్నా ఏడు రోజుల్లో మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మునిసిపల్ జిల్లా ఆరోగ్య అధికారి విశ్వనాధ రెడ్డి,రిజిస్ట్రేషన్ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరయ్య, పంచాయతీ సెక్రటరీ లు మరియు మునిసిపల్ జనన మరణ ధ్రువీకరణ కరణ అధికారులు పాల్గొన్నారు.