బాల్య వివాహాలపై అవగాహన ర్యాలీ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, అందుకు సహకరించిన వారికి కూడా జైలు శిక్ష తప్పదని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, సిడిపిఓ రమాదేవి లు అన్నారు, బుధవారం వారు సర్పంచ్ సిద్ధిగారి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో బాల్యవివాహాలు నిషేధించాలి అనేసి మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా పోలీసులు ,అంగన్వాడీ ,కార్యకర్తలు వెలుగు సిబ్బంది ఆశాలు అందరూ కలిసి చెన్నూరు ఎంపీడీవో కార్యాలయం నుండి, తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది, అనంతరం చెన్నూరు పాత బస్టాండ్ నందు మానవహారం నిర్వహించి బాల్య వాహాల నిషేధం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది, అలాగే అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది, ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నాయి అని తెలిసిన వెంటనే సర్పంచ్ కి కానీ లేదా పోలీసు డిపార్ట్మెంట్ వారికి తెలియజేయాలని వారు తెలియజేశారు, ఎక్కడ కూడా 18 సంవత్సరాల లోపు అమ్మాయికి వివాహం జరిగినట్లయితే చట్టపరంగా నేరమని చట్టం గురించి వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్, భాస్కర్ రెడ్డి ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, డిప్యూటీ తాసిల్దారు, డాక్టర్ బి చెన్నారెడ్డి, ఏఎస్ఐ జాకీర్ హుస్సేన్, ఏ పీఎం గంగాధర్, మహిళా పోలీసులు వెలుగు యానిమేటర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్ ,పాల్గొనడం జరిగింది.