‘పౌష్టికాహార మాసోత్సవం’పై అవగాహన సదస్సు
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు నగరంలోని పెద్ద మార్కెట్ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం ‘ పౌష్టికాహార మాసోత్సవంపై ఐసీడీఎస్ పీడీ ప్రవీణ అవగాహన కల్పించారు. పాఠశాలలోని 200 మంది విద్యార్థులకు పోషణ, పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించారు. ఆ తరువాత క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతి అందజేశారు. ప్రధాన ఇంద్ర ధనస్సు రంగులోని ఆహార పదార్థాలను తీసుకోవాలని, పిల్లల చేతులకు 7 రంగులు ఉన్న హెయిర్ బండ్స్ వేయడం జరిగింది. ఆ తరువాత అంగన్వాడీ టీచర్లకు ప్రీ స్కూల్ కిట్స్ అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ ఇన్చార్జ్ హెచ్ఎం, ఏఎన్ఎం, మహిళా పోలీస్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.