ప్రో-బోనో లాయర్లు… టెలి లా పథకంపై అవగాహన సదస్సు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: గౌరవ జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా న్యాయమూర్తి శ్రీ ఎన్.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు, ఈ రోజు ప్రో-బోనో లాయర్లు మరియు టెలి లా పథకము గురించి , అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు, న్యాయ సేవసదన్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది. కార్యదర్శి మాట్లాడుతూ ప్రో-బోనో లాయర్లు మరియు టెలి లా పథకము గురించి, ఏ ఒక్క అమాయకుడికి కూడా అన్యాయం జరగకూడదనే సూత్రం న్యాయ వ్యవస్థకు పునాది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రోబోనో అప్ ను డౌన్లోడ్ చేసుకొని తమ సమస్యలకు పరిష్కారము నేరుగా ప్రోబోనో లాయర్ ద్వారా పొందవచ్చు అని తెలియజేశారు.