PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పశువులలో పునరుత్పత్తి సమస్యలు పై అవగాహన సదస్సు 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  రిలయన్స్ ఫౌండేషన్ మరియు పశు సంవర్ధక శాఖ  ఆధ్వర్యంలో సోమవారం దేవనబండలో పశువుల పాడి మహిళా రైతులకు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు సహాయ సంచాలకులు డాక్టర్ రవి ప్రకాష్ రెడ్డి గారు , అదనపు సహాయ సంచాలకులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు పశు వైద్యురాలు డాక్టర్ స్వర్ణలత గారు  పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ సుధాకర్ రెడ్డి  మాట్లాడుతూ, పాడి లో ఈతకు, ఈతకు మధ్య 14 నుండి 15 నెలల వ్యత్యాసం ఉండాలన్నారు. పాడి పశువు ఈనిన తర్వాత మూడు, నాలుగు నెలల్లో మళ్లీ చూడు కట్టించాలని, మరియు దూడ పుట్టిన అరగంటలోపు  దూడకు జున్నుపాలుతాగించాలని చెప్పారు. దూడ పుట్టిన ఏడు రోజుల నుంచి పది రోజుల్లోపు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులుతాపించతంతోపాటుటీకాలుక్రమంతప్పకుండావేయించాలనతెలిపారు.అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం ప్రకాష్ గారు మాట్లాడుతూ రైతులు వాతావరణ వర్షము సమాచారము వ్యవసాయ పశు పోషణ సమాచారం కోసం ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించి ఉచిత సలహాలు మరియు సూచనలను పొందవచ్చన్నారు.

About Author