సహకార సంస్థల ఆర్థిక బలోపేతానికి అవగాహన సదస్సులు..
1 min read– సదస్సులకు సహకార అధికారులకు ఆదేశాలు.. సహకారం అందిస్తాం..
– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : కేంద్ర సహకార శాఖ ఆదేశాలకు అనుగుణంగా సహకార సంస్థల ఆర్థిక బలోపేతానికి సభ్యులు భాగస్వామ్యాన్ని పెంచడానికి రాష్ట్రస్థాయిలో, అదే విధంగా జిల్లా స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటులో భాగంగా స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ ఎల్ ఎన్ టి శ్రీనివాస్ ఏలూరు జిల్లా సందర్శనలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ని మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా జిల్లాలో నిర్వహించే అవగాహన సదస్సులు గురించి వివరించారు. వీటిని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వవలసినదిగా ఆయన జిల్లా కలెక్టర్ ని కోరారు. సహకార సంస్థల ఆర్థిక బలోపేతానికి సభ్యులు భాగస్వామ్యాన్ని పెంచడానికి జిల్లా స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని ఆ మేరకు జిల్లా సహకార అధికారి ఏలూరు వారికి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తగు ఆదేశాలు ఇచ్చారు.