సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలి
1 min read– ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి కుష్టి వ్యాధి గ్రస్తులను గుర్తించాలి
– జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ ఖాదర్ వలీ
పల్లెవెలుగు ,వెబ్ చెన్నూరు : ప్రజలకు సీజన్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలాగే గ్రామాలలో ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగినటువంటి సూచనలు సలహాల తో పాటు తగిన జాగ్రత్తలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ ఖాదర్ వలీ అన్నారు, మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆషాడే సమావేశం సందర్భంగా ఆయన పాల్గొని, ఏఎన్ఎం లకు, అదేవిధంగా ఆశా వర్లకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా ఆశా వర్కర్లు, గ్రామాలలో సీజన్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, అంతేకాకుండా ప్రత్యేకంగా నవంబర్ 15వ తేదీ నుండి, డిసెంబర్ 5 వ తేదీ వరకు నిర్వహిస్తున్న( ఎల్ ఎల్ డి సి…. లెప్రసికేస్ డెడికేషన్ కాంపెయిన్,) కుష్టు వ్యాధిగ్రస్తుల ను వారి వారి ఇంటి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వారికి మందులు పంపిణీ చేయడమే కాకుండా తగినటువంటి సూచనలు ఇవ్వాలని తెలియజేశారు, అలాగే ఆశ వర్కర్ల వద్ద ఉన్న గర్భవతులకు, చిన్నపిల్లలకు, బాలింతలకు సంబంధించిన రికార్డులు అన్నిటిని కూడా ఆయన పరిశీలించారు, ప్రతి ఆశ వర్కర్ రికార్డులకు సంబంధించి బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి టీకాలు వేయడం జరిగింది వంటి ప్రతి విషయాన్ని రికార్డు రూపంలో ఉంచాలని తెలిపారు, అలా కాకుండా అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు, గ్రామాలలోని ఆరోగ్య ఉప కేంద్రాలలో ప్రజలకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించి వారికి తగిన మందులు పంపిణీ చేయాలని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ చెన్నారెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.