బాల్యవివాహాలు నిర్మూలనే లక్ష్యంగా గ్రామాల్లో అవగాహన కల్పించాలి
1 min read– ఎంపీడీవో శివ మల్లీశ్వరప్ప.
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప అధ్యక్షతన మంగళవారం నాడు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలనపై అంగన్వాడి కార్యకర్తలు జి ఎం ఎస్ కే సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ. బాల్యవివాహాలు జరిపించిన ప్రోత్సహించిన చట్టరీత్యా నేరమని రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష నాన్ బెయిలబుల్ చట్టం వర్తిస్తుందని బాల్యవివాహాలు జరిపిస్తే జరిగే అనర్ధాలను గురించి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యవివాహాలు చేయకూడదని 18 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు అమ్మాయిలకు వివాహం చేయకూడదని తెలిపారు. బాల్య వివాహాలు జరిపిస్తే జరిగే నష్టాలను గురించి వివరించారు. వివాహం జరిపించిన అందులో పాల్గొన్నవారు చట్ట పరమైన చర్యలకు బాధ్యులవుతారని గ్రామాలలో అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ మహిళ సంరక్షకురాలు ప్రజలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు బాల్యవివాహాలను నిర్మూలించడానికి కృషి చేయాలని సూపర్వైజర్లు జయలక్ష్మి కళావతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు రాములమ్మ. వసంతమ్మ. రామ చెన్నమ్మ. లలితమ్మ .పుష్ప .రాణి. విజయ కుమారి. తదితరులు పాల్గొన్నారు .