అయోధ్య రామమందిరం… అక్షింతల శోభాయాత్ర
1 min readవిశ్వహిందూ పరిషత్ వారి అధ్వర్యంలో పత్తికొండలో శ్రీ రాముల వారి అక్షింతల వితరణ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : విశ్వహిందూ పరిషత్ పత్తికొండ ప్రఖండ అధ్యక్షులు వీర రాజు అద్వర్యంలో పత్తికొండ పట్టణం నందు అయోధ్య నుంచి వచ్చినటువంటి పరమ పవిత్రమైన శ్రీ రామయ్య వారి అక్షింతల శోభాయాత్ర చక్రాల రోడ్డు సుంఖం గేటు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఊరేగింపు జరిగింది. ఇందులో భాగంగా పత్తికొండ నందు ఇంటింటికి అక్షింతల వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. టిడిపి పత్తికొండ అసెంబ్లీ ఇంచార్జ్ శ్యాం బాబు, వైయస్సార్ పార్టీ నాయకులు రామచంద్ర రెడ్డి, ఆయన సతీమణి నాగరత్నమ్మ, పోచిమి రెడ్డి సేవాదళ్ సంస్థ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డి పత్తికొండ డియస్పి శ్రీనివాస రెడ్డి, యంపిడివో కవిత మరియు ఇతరులను మర్యాదపూర్వకంగా కలిసి అయోధ్య రాముల వారి అక్షింతలు మరియు అయోధ్య రామ మందిర చిత్ర పటములు సమర్పించారు. ఈ సందర్భంగా ఈ శోభాయాత్ర కార్యక్రమంలో పల్గొన్న బిజెపి పత్తికొండ అసెంబ్లీ కన్వీనర్ రంజిత్ కర్ణి మాట్లాడుతూ, అయోధ్య శ్రీరాముల వారి అక్షింతలు తీసుకున్న ప్రతి ఒక్కరు వాటిని వృద్ది చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చని అన్నారు. వృద్ది చేసుకోవడం అనగా మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షింతలు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో కలపడమే అని తెలిపారు. 22 జనవరి 2024 రోజున అయోధ్యలో శ్రీ బాల రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో మీ ఇల్లు శుబ్రం చేసుకుని ఉదయం 11 గంటలకు దగ్గరలోని దేవాలయంలో ఎక్కడైనా రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం ఉంటే మీ కుటుంబసభ్యులు మరియు ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులతో కలిసి దేవాలయం నందు ప్రత్యక్ష ప్రసారం వీక్షించమని కోరారు. మీకు అందించినటువంటి అక్షింతలను వృద్ది చేసుకున్న తరువాత మీ ఇంట్లో జరిగే శుభకార్యాలలో ఉపయోగించుకోవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో దండి మల్లికార్జున, పూనా మల్లికార్జున, బ్రహ్మయ్య వాల్మీకి, రామాంజినేయులు వాల్మీకి, భాస్కర్, కరణం చంద్ర, గోరంట్ల, నాగ, కార్తీక్, నరేష్, నాగ రాజు, వినోద్, రంగన్న, మారుతి, సూర్య, రమేష్, సురేష్, శంకరయ్య ఆచారి, విజయ్ మరియు ఇతర హిందూ బంధువులందరూ శోభాయాత్ర సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.